రైతుల త్యాగాలకు వాస్తవ రూపం.
రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు
రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఫైల్స్ సినిమాతో వైసిపి ప్రభుత్వంకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి.
రైతుల బతుకు చిత్రంపై తీసిన సినిమాను అడ్డుకునే నీచస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారింది.
సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటి. ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భయంతో వైసిపి కోర్టుకు వెళ్ళింది.
అమరావతిలో 34 వేల మంది రైతుల త్యాగాలను బూడిదలో పోసి నాశనం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రం కోసం ప్రజల కోసం తీసిన సినిమాను ఈ రాష్ట్ర సీఎం అడ్డుకోవడం చాలా దారుణం.
ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని ఛిద్రం చేసిన తుగ్లక్ సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో మోసం చేసి ప్రాంతాల పేరుతో ప్రజలను రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు.
అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన రాష్ట్ర సీఎం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చాడు.
మాట తప్పను మడమ తిప్పను అనే మన సీఎం జగన్ రెడ్డి ఆంధ్రుల రాజధాని అమరావతిపై యూటర్న్ తీసుకున్నదో లేదో చెప్పాలి.
చంద్రబాబు నాయుడు మహా యజ్ఞంలో ప్రారంభించిన అమరావతిని కావాలనే తెలుగుదేశం పార్టీకి వస్తున్న మైలేజ్ ను చూసి ఓర్వలేక ఈ సైకో చేష్టలు చేస్తున్నాడు.
నిన్నటిదాకా మూడు రాజధానుల పాట పాడిన వైసిపి నేడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని అంటుంది పక్క రాష్ట్రాల దగ్గర రాజధాని కావాలని అడుక్కునే స్థాయికి దిగజార్చిన ఈ సైకో సీఎం మూడు రాజధానుల పేరుతో ఏపీని నిలువు దోపిడీ చేసి ఈ ఐదేళ్లలో దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కావున రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నీ నిలబెట్టిన ఘనత ఏపీ సీఎం జగన్ రెడ్డికి దక్కుతుంది.