మాస్కో డిసెంబర్ 26: రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉక్రెయిన్ చేసిన దాడిలో.. నల్ల సముద్రంలో ఉన్న తమ నౌక డ్యామేజ్ అయినట్లు రష్యా ఒప్పుకున్నది. రష్యా ఆక్రమిత క్రిమియాలో ఉన్న ఫెడోసియా పోర్టు వద్ద ఈ ఘటన జరిగింది. అతి భారీ నౌక నోవోచెరకసక్పై ఉక్రెయిన్ విమానం మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు రష్యా చెప్పింది. అయితే ఆ నౌకను ధ్వంసం చేసినట్లు ఇటీవల ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్న విషయం తెలిసిందే.దాడి వల్ల నౌకలో ఉన్న ఆరు బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయని, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు కొంత మందిని తీసుకెళ్లినట్లు క్రిమియా అధికారులు చెప్పారు.యుద్ధనౌక డ్యామేజ్ చేసిన తర్వాత రష్యా ప్రతీకార దాడికి పాల్పడిరది. ఉక్రెయిన్‌కు చెందిన రెండు సుఖోయ్`24 జెట్ విమానాలను రష్యా పేల్చివేసింది. ఆ జెట్లను నికోలేవ్ సిటీ వద్ద కూల్చినట్లు రష్యా తెలిపింది.