విజయవాడ, మే 27: : ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రతతో ఈవీఎంలు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టిన అనంతరం ఈవీఎంల్లో ఓట్లు లెక్కిస్తారు. ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, టేబుళ్ల ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిరచేందుకు చర్యలు చేపడుతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల సవిూపంలోనే విూడియా సెంటర్లు ఏర్పాటు చేసి బిగ్‌ స్క్రీన్స్‌లో ఫలితాలు వెల్లడయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఉపయోగించనున్నారు. కాగా, కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కౌంటింగ్‌ ఏజెంట్లు కేంద్రాలకు ఉదయం 6 గంటల్లోపు వెళ్లాలి. ఫాం 18పై రిటర్నింగ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకోవాలి.
అనంతరం విూకు ఇచ్చే ఐడీ, ఆధార్‌, ఫాం 17అ, బుక్‌ లెట్‌, పెన్‌ తీసుకెళ్లాలి. కౌంటింగ్‌ కేంద్రాలకు మొబైల్స్‌ అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్లాక మళ్లీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు వచ్చేందుకు అనుమతించరు.
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఫలితాలకు సంబంధించి వేర్వేరుగా కౌంటింగ్‌ హాల్స్‌ ఉంటాయి. విూకు కేటాయించిన టేబుల్‌ నెంబర్‌ వద్ద కూర్చోవాలి.
ఒక్కో టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్వైజర్‌, కౌంటింగ్‌ ఆఫీసర్‌, అబ్జర్వర్‌ ఉంటారు. అలాగే, ఓ ఆర్వో, ఓ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, ఏజెంట్‌ ఉంటారు.
ఏ పోలింగ్‌ బూత్‌ల నుంచి కంట్రోల్‌ యూనిట్స్‌ ఏ టేబుల్‌కు వెళ్లాలనేది ముందుగానే నిర్ణయిస్తారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ తర్వాత, ఈవీఎంల కౌంటింగ్‌ ఉంటుంది. ఏజెంట్లు కంట్రోల్‌ యూనిట్ల యంత్రాల సీల్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలి.
అనంతరం 17అ ఫాం వివరాలు అధికారులు చెప్పిన వాటితో సరి చూసుకోవాలి. ఫలితాలు వెల్లడవుతున్నప్పుడు పోలింగ్‌ తేదీ, పోలైన ఓట్లను సరి చూసుకోవాలి. విూ దగ్గర ఉన్న 17అ ఫాంలోని వివరాలు అక్కడ వాటితో తేడాగా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలి.
ఫలితాలు వెల్లడి సమయంలో విూ అభ్యర్థి వివరాలతో సహా అన్నీ నోట్‌ చేసుకోవాలి. విూతో పాటు అన్ని ఫలితాలను కూడా కౌంటింగ్‌ సూపర్వైజర్‌ కూడా నోట్‌ చేస్తారు.
ఫలితాలు విూరు మళ్లీ చూడాలని అనుకుంటే రిటర్నింగ్‌ అధికారిని అడిగితే మెషీన్‌ లో బటన్‌ నొక్కి చూపిస్తారు. అంతా సవ్యంగా పూర్తౌెతే కౌంటింగ్‌ సూపర్వైజర్‌ ఇచ్చిన 17అ ఫాం పార్ట్‌ 2పై సంతకం చేయాలి. అందరికీ సమ్మతమైతే ఆ ఫాంను ఆర్వోకు అందించి ఫలితాలు వెల్లడిస్తారు.
’ఫాం 17అ’ ఇంకో అధికారికి అందిస్తారు. ఆ వివరాలు ‘ఫాం 20’లో భద్రపరుస్తారు. నియోజకవర్గంలో అన్ని కంట్రోల్‌ యూనిట్స్‌ పూర్తౌెన తర్వాత వీపీ ప్యాట్‌ మెషీన్స్‌లో పేపర్‌ స్లిప్స్‌ కౌంట్‌ చేస్తారు. ఈ నెంబరు దానికి సంబంధించి కంట్రోల్‌ యూనిట్‌లో నెంబర్‌ సరిపోలుస్తారు.
ఈ సమస్యలుంటే..కంట్రోల్‌ యూనిట్స్‌ తెచ్చినప్పుడు సీల్స్‌ సరిగ్గా లేకున్నా.. రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలి. గ్రీన్‌ సీల్‌ బ్రేక్‌ అయి ఉంటే ఆర్వోకి చెప్పాలి. ఆయన అది తీసుకెళ్లి దానికి సంబంధించిన వీవీ ప్యాట్‌ మెషీన్‌ ను తెప్పించి దానిలో స్లిప్స్‌ కౌంట్‌ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ కౌంటింగ్‌ చివరలో సాగుతుంది.
ఒకవేళ కంట్రోల్‌ యూనిట్‌ ఆన్‌ కాకుంటే ఆర్వోకి తెలియజేయాలి. ఆయన సరిచేస్తారు. అప్పటికీ పని చేయకపోతే.. పక్కకు తీసుకెళ్లి ఆ కంట్రోల్‌ యూనిట్‌ కు సంబంధించి వీవీ ప్యాట్‌ స్లిప్స్‌ కౌంట్‌ చేస్తారు.
విూ ‘17అ ఫాం’ లోని మొత్తం ఓట్లు కంట్రోల్‌ యూనిట్‌లో చూపించిన ఓట్లు తేడా ఉంటే ఆర్వోకి తెలియజేయాలి. ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు రావద్దు. ఇంకా ఏమైనా సందేహాలుంటే ఎన్నికల సంఘం ఇచ్చిన హ్యాండ్‌ బుక్‌లో చూసుకోవాలి.
ఫామ్‌ 17అ ఏంటంటే?
ఎన్నికల రోజు ప్రతి బూత్‌లో పోలింగ్‌ పూర్తౌెన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో ప్రిసైడిరగ్‌ అధికారి సంతకంతో పార్టీల ఏజెంట్లు ‘ఫామ్‌ ` 17అ’ తీసుకుంటారు. ఇందులో పోలింగ్‌ స్టేషన్‌ పేరు, కోడ్‌ నెంబర్‌ వంటి వివరాలు సైతం ఉంటాయి. ఈ ఫామ్స్‌ను నియోజకవర్గ పార్టీ ఆఫీస్‌లకు పంపుతారు. కౌంటింగ్‌ రోజు వీటిని ఏజెంట్లు తమ వెంట తీసుకెళ్తారు. ప్రతి ఈవీఎంలోనూ పోల్‌ అయిన ఓట్లకు, ఫామ్‌ ` 17అలో నమోదు చేసిన ఓట్లకు లెక్క సరిపోలాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *