చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ మన చోడవరం సిద్ధమేనా. ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పేద కుటుంబాల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి:
కేవలం మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. మనం వేసే ఓటుతో రాబోయే 5 ఏళ్లలో విూ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే:
ఈ ఎన్నికల్లో జగన్‌ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే.
ఇదే మళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కాని హావిూలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతున్న సత్యం.
పేదల వ్యతిరేకులను ఓడిరచేందుకు విూరు సిద్ధమా ?:
మరి మన చోడవరంలో విూరంతా విూ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడిరచేందుకు విూరంతా సిద్ధమేనా?..
పేదలకు జై కొడుతున్న ఓ అవ్వ, ఓ అక్క, ఓ అన్నా.. విూరంతా చెప్పాలి.. ఓ బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్తా గోవిందా గోవింద.. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవింద గురించే. ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా?ఇది గుర్తుందా? అక్కా, అన్నా ఇది గుర్తుందా? (పాంప్లెట్‌ చూపిస్తూ) 2014లో ముఖ్యమైన హావిూలంటూ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయానా సంతకం పెట్టి ఇప్పటి కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ల ఫొటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీగారి ఫొటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌ విూ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం కనిపిస్తోందా?
చంద్రబాబును నమ్మి ఓటేస్తే:
ఇది 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చే దాకా.. ఎన్నికలు వచ్చేదాకా… ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు. ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి అన్నాడా లేదా? మరి 5 ఏళ్లు, ప్రతి ఇంటికీ నెలనెలా రూ.2 వేలు అంటే 60 నెలల్లో రూ.1.20 లక్షలు ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన ఆ తల్లిదండ్రులూ ఏమైంది?
ముఖ్యమైన హావిూలంటూ ఇంకా ముందుకు పోదామా ఆయన ఏం చెప్పాడో? రూ.87,612 కోట్లు రైతు రుణాల మాఫీ అని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.
ఇంకా ముందుకు పోదామా.. ముఖ్యమైన హావిూలంటూ రూ.14,205 కోట్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. ఎన్నికలు అయ్యాయి. నా అక్కచెల్లెమ్మలు చంద్రబాబు నాయుడుని నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవింద.
మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు2014లో ముఖ్యమైన హావిూలంటూ ఇచ్చిన ఇంకొక హావిూ. ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నా అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైందక్కా తర్వాత. ఏమైందన్నా తర్వాత. గోవిందా.. గోవింద.
హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢల్లీితో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు. దాన్నీ గోవిందా..సింగపూర్‌ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం అన్ని హంగులతో కనిపిస్తున్నా వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్‌ రాజధాని ఏమైంది అంటే అదికూడా గోవిందా.. గోవింద.
బాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే:
ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ అన్నాడు. మరి విూ చోడవరంలో ఏమైనా కనిపిస్తోందా అని అడుగుతున్నాను. అది కూడా గోవిందా. మరి 2014లో ముఖ్యమైన హావిూలంటూ విూ ప్రతి ఇంటికీ ఈయన సంతకం పెట్టి, వీళ్ల ముగ్గురి ఫొటోలతో ప్రతి ఇంటికీ పంపించిన చంద్రబాబు ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హావిూ అయినా నెరవేర్చాడా? మరి ఈ పెద్దమనిషిని నమ్మవచ్చా అని అడుగుతున్నాను. నమ్మవచ్చా అన్నా, తమ్ముడూ, అమ్మా.. నమ్మవచ్చా?
సూపర్‌ సిక్స్‌ అంటున్నాడు నమ్మవచ్చా? సూపర్‌ సెవెన్‌ అంటున్నాడు నమ్మవచ్చా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నాడు, బెంజ్‌ కారు అంటున్నాడు నమ్మవచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.
బాబు అధికారంలోకి వస్తే పథకాలు గోవిందా.. వర్షాలు గోవిందా:
బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా. బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను.
దోచుకుని.. పంచుకునే దుష్ట చతుష్టయం:
మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికీ ఏ మంచీ చేయని ఈ వ్యక్తి. తన హయాంలో తాను చేసిందేమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి ఇంత అని వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదీ చంద్రబాబు గారు తన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఇదీ. ప్రతి ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్కా, అన్నా, తమ్ముడూ నేను చెప్పేది బాగా వినండి.
చంద్రబాబు దోచుకున్న డబ్బు ఇస్తే వద్దనొద్దు:
విూ బిడ్డ ఈరోజు బటన్‌ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లిపోతోంది. కానీ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడుగారి హయాంలో ఆయన చేసిందేమిటి అంటే అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకుని పంచుకున్నారు. ఆ దోచుకుని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చే సరికే ఏం చేస్తాడు? ఆ డబ్బులోంచి విూలో ప్రతి ఒక్కరికీ ఓటుకు రూ.2వేలు అంటాడు. ఓటుకు రూ.3 వేలు అంటాడు. కొన్ని కొన్ని చోట్ల ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు అంటాడు. ఇక్కడే విూ అందరికీ చెబుతున్నాను. చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకండి. ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.విూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఆ తర్వతనే ఓటు వేయండి అని కోరుతున్నాను.
విూ జగన్‌ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ పెంచిన అమ్మ ఒడి, మళ్లీ ఓ చేయూత, మళ్లీ ఓ సున్నా వడ్డీ, మళ్లీ ఇళ్ల స్థలాలు, మళ్లీ ఇల్లు కట్టించే కార్యక్రమం. విూ జగన్‌ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, మళ్లీ ఓ వాహనమిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, మళ్లీ ఓ మత్స్యకార భరోసా, మళ్లీ ఓ తోడు, చేదోడు, లా నేస్తం.. ఈ పథకాలన్నీ రావాలి అంటే మళ్లీ విూ జగన్‌ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతి దీవెన, నా అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కల్యాణమస్తు, షాదీ తోఫా, రైతన్నలకు మంచి జరుగుతుంది.
పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఫ్యాను గుర్తుపై ఓట్లేసి గెలిపించండి:
వాలంటీర్లు మళ్లీ విూ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మనవ్యవసాయం, మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాను విూద నొక్కాలి.
175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *