విద్యార్థులను అభినందించిన రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి
తాడేపల్లిగూడెం:నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్‌ (ఏపీ నిట్‌) ఆచార్యులు డాక్టర్‌ టి.కార్తికేయ శర్మ మార్గనిర్దేశంలో పలువురు విద్యార్థులు (ఫ్లెక్సీ పోల్డ్‌) ఎలక్ట్రికల్‌ బైకును రూపకల్పన చేశారు. సంస్థలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఎం.మనోజ్‌ నాయక్‌, ఎం.అనీషా, కే.ప్రత్యూష, కే.రాజేశ్వరి, కే.గణ వరప్రసాద్‌ లు బృందంగా ఏర్పడి ఈ ఎలక్ట్రికల్‌ బైక్‌ ను 20 రోజులు శ్రమించి రూపొందించారు. దీనికి రెండు గంటలు చార్జింగ్‌ పెడితే గంటకు18`20 కిలోవిూటర్ల వేగంతో 25 కిలోవిూటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఇది150 నుంచి 200 కిలోల బరువును తట్టుకోగలదు. అంతేగాకుండా ఈ బైక్‌ ను మడతపెట్టి కారులో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. కార్లు వంటి వాహనాలు వెళ్లలేని ప్రదేశాల్లో, మోకాళ్ళు నొప్పులతో ఎక్కువ దూరం నడవలేని వృద్దులకు ఈ విద్యుత్‌ బైక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాహన రూపకల్పన నిమిత్తం మొత్తం రూ:20 వేలు నగదును వెచ్చించారు. విద్యార్థులను, వారికి అవసరమైన సలహాలు,సూచనలిస్తూ మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్యులు డాక్టర్‌ టి.కార్తికేయ శర్మను రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకర్‌ రెడ్డి, డీన్‌ లు డాక్టర్‌ జి.ఆర్కేశాస్త్రి, డాక్టర్‌ జీబి వీరేష్‌ కుమార్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ టి.బాబురావు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దినేష్‌ శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థకు చెందిన పలువురు విద్యార్థులు ఎలక్ట్రికల్‌ బైకును రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్‌ అంతా విద్యుత్‌ వాహనాలదేనన్నారు. సమాజ హితం కోసం సృజనాత్మక ఆలోచనలకు ఆధునిక సాంకేతికతను జోడిరచి మరిన్ని విద్యుత్‌ వాహనాల రూపకల్పనకు విద్యార్థులు కృషి చేసి, అంకుర పరిశ్రమలను నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్‌ జి.సంతోష్‌ కుమార్‌, డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ ఎం.హైమావతి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *