ఐదేళ్లలో సంపాదన రూ. 1147678300
కట్టిన ఆదాయపు పన్ను రూ. 470732875
జిఎస్టీ రూ. 268470000 చెల్లింపు
అప్పులు రూ. 642684453 అఫిడవిట్‌ లో వెల్లడి
పిఠాపురం ఏప్రిల్‌ 23: జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం ఎంఎల్‌ఏగా మంగళ వారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల ఆదాయం, అప్పులు, కట్టిన పన్నుల వివరాలు వెల్లడిరచారు. ఐదేళ్లలో సంపాదన రూ. 1147678300 కాగా, కట్టిన ఆదాయపు పన్ను రూ. 470732875, జిఎస్టీ రూ. 268470000 చెల్లించినట్లు తన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. కాగా తన అప్పులు రూ. 642684453గా ప్రకటించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్నవి రూ. 175684453 కాగా, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ. 46.70 కోట్లు అని వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *