జగన్‌ కులానికి పదవులు, పెత్తనం.. క్రిస్టియన్‌ లకు మొండి చేయి
జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోసెఫ్‌

గుంటూరు ఏప్రిల్‌ 6: అన్ని వర్గాల కంటే క్రైస్తవ సమాజానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఘోరమైన అన్యాయం చేశారని జీసస్‌ బిలీవర్స్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోసెఫ్‌ మోసిగంటి ఆరోపించారు.ఈనెల ఏప్రిల్‌ 2 నుంచి ముగ్గురు నూతన రాజ్యసభ ఎంపీలు సభ్యత్వంతో, వైఎస్‌ఆర్‌ సిపి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది, 11 ఎంపీలు కి, 11 ఎంపీలు వైయస్సార్సీపి వసమైనవి, కానీ జగన్‌ గారు క్రైస్తవుడు, క్రైస్తవులకు ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటారు, వైఎస్‌ఆర్‌ సిపిలో పదవులు, పెత్తనం రెడ్లకి, పేదలకును పథకాలకి పరిమతం చేసి జగన్‌ మోసం చేసారని అన్నారు. సొంత మతంకి మొండి చేయి, దీనికి నిదర్శనం 11 రాజ్యసభ ఎంపీలలో, ఐదుగురు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వారు, ఒక్కటి కూడా క్రైస్తవులకు ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాగే 48 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా నలుగురు ముస్లిం వర్గానికి ఇస్తే, ఒక్కటి కూడా క్రైస్తవ సమాజానికి ఇవ్వలేదు, మన పక్కనే ఉన్న చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్సీని క్రైస్తవులకు గత ప్రభుత్వం కేటాయించింది. జగన్‌ ఇవ్వక పోగా, షెడ్యూల్‌ కులాల వారికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చి, క్రైస్తవ మైనారిటీకి ఇచ్చినట్టు జగన్మోహన్‌ రెడ్డి గారు చెప్పారని అని విమర్శించారు.క్రైస్తవులంటే ఒక్క షెడ్యూల్‌ కులాల వారే కాదని, ఏ కులాల వారైనా ఏసుప్రభుని నమ్మి, చర్చికి వెళ్తూ, రాజ్యాంగ ప్రకారం క్రైస్తవుడుగా నమోదు చేసుకుంటే వారు క్రైస్తవ మైనార్టీ క్రిందకు వస్తారని. షెడ్యూల్‌ కులాల వారు చర్చికి వెళ్తూ, క్రైస్తవ పేరు ఉన్నప్పటికీ, వారు బహిరంగంగా క్రైస్తవుడుగా డిక్లేర్‌ చేసుకోకపోతే, వారు క్రైస్తవ మైనార్టీ క్రిందకు రారని, ఎస్సీ షెడ్యూల్‌ కులాల కోటలోనే ఉంటారని , ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్‌ రెడ్డి గారు క్రైస్తవులను పుచ్చారని వాపోయారు, ఒక వ్యక్తిని షెడ్యూల్‌ క్యాస్ట్‌ కోటాలోను, క్రైస్తవ మైనారిటీలోను ఎలా చూపిస్తారని జోసెఫ్‌ మోసిగంటి ప్రశ్నించారు.రాజ్యాంగం లోని 1950 షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఆర్డర్‌ ప్రకారం భారతదేశంలో ఒక్క షెడ్యూల్‌ కులాల వారు ఏసుప్రభు నమ్మితే వారుకున్న 15 శాతం షెడ్యూల్‌ క్యాస్ట్‌ రిజర్వేషన్‌ పోతుంది, ఒక శాతం రిజర్వేషన్‌ వున్న బీసిసి క్యాటగిరి లోకి వెళ్ళిపోతారు, ఇది ఒక అన్యాయం. ఆ అన్యాయం భరించి షెడ్యూల్‌ కులాల వారు రిజర్వేషన్‌ వదులుకుని బీసిసి క్రైస్తవులుగా ఉంటే, జగన్‌ గారు, ఎస్సిలకు ఇచ్చి, క్రైస్తవులకు ఇచ్చినట్టుగా చూపించి క్రైస్తవలకు అన్యాయం చేసారు. నామినేటెడ్‌ పదవుల విషయం లో క్రైస్తవులైన బీసిసి లని బీసీల కోటా కింద న్యాయం చేయలేదు, క్రైస్తవ మైనారిటీ కోటా కింద న్యాయం చేయ లేదు. ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని జగన్‌ జాన్‌ వెస్లీ ఎస్సిమాల వర్గానికి ఇచ్చారు.జగన్మోహన్‌ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీల ఖాళీలకు అభ్యర్థులను నియమిస్తూ, నా ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు సమన్యాయం చేశాను అని మాట్లాడారని, దాన్లో ముస్లింలు లేరని, క్రైస్తవ పేర్లు ఉన్నాయని కానీ వారు క్రైస్తవులుగా డిక్లేర్‌ చేసుకోలేదని, ఒకాయన బొమ్మి ఇజ్రాయిల్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఇంకొకరు చంద్రగిరి యేసు రత్నం, ఆయన వడ్డెర సామాజిక వర్గం, కానీ వారి పేర్లు మాత్రమే క్రైస్తవ పేర్లని, క్రైస్తవ సమాజ పక్షంగా వారేమి లేరని , ఇజ్రాయిల్‌, యేసు రత్నం మాట్లాడుతూ వారి స్పీచెస్‌ లో వారు, వారి సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు గాని, క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్ప లేదని అయినా జగన్‌ గారు వారిని క్రైస్తవ మైనారిటీ కింద ఇచ్చినట్టు చెప్పటం, క్రైస్తవులను పుచ్చటమేనని ప్రొఫెసర్‌ జోసెఫ్‌ అన్నారు. 48 ఎమ్మెల్సీ స్థానాలలో, నాలుగు ఎమ్మెల్సీ ముస్లిం వర్గానికి ఇచ్చారు , 11 రాజ్య సభ స్థానాలలో, ఐదు రాజ్య సభ స్థానాలు రెడ్లకు ఇచ్చారు, ఒక్క స్థానం కూడా క్రైస్తవులకు ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీస్‌ గా క్రిస్టియన్‌, ముస్లిం, సిక్‌, బుద్దిస్ట్‌, జురాస్టియన్‌ అయితే, ఒక్క ముస్లిం వర్గానినే మైనారిటీ గా చూస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం క్రైస్తవులను మైనార్టీలుగా గుర్తిస్తే, జగన్‌ గారు క్రైస్తవలను ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీగా గుర్తించలేదన్నారు.సుమారు రెడ్లు 70 శాతం వైసీపీ కి ఓట్లు వేస్తే, సుమారు 25 శాతం ఉన్న క్రైస్తవ సమాజాం, జగన్‌ గారిని ఓన్‌ చేసుకుని 98% ఓట్లేసిన క్రైస్తవుల పట్ల, కృతజ్ఞత లేకుండా, జగన్‌ మోసం చేశారని, రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు పంచి ఇచ్చారని సజ్జల, వై వి సుబ్బా రెడ్డి, విజయ సాయిరెడ్డి ,పెద్ది రెడ్డి రామ చంద్ర రెడ్డి, దీనిని క్రైస్తవ సమాజాం గుర్తించి, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాలని డాక్టర్‌ జోసెఫ్‌ కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *