ఇండియా’కు మరో షాక్.. ఆప్ సంచలన నిర్ణయం..
ఇప్పటికే తాము అలిసిపోయాం.. ఎన్నికల్లో నిలబడి గెలవాలనేదే మా లక్ష్యం
న్యూఢల్లీి ఫిబ్రవరి 8:లోక్‌సభ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలోనే ఇండియా కూటమి వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. అస్సాం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో జాప్యం పేరిట తన అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది. దిబ్రూగఢ్ స్థానం నుంచి మనోజ్ ధనోవర్, గువాహటి నుంచి భాబెన్ చౌదరి, తేజ్‌పూర్ స్థానం నుంచి రిషి రాజ్ కౌటిన్యను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆప్ ఎంపీ, పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ కీలక ప్రకటన చేశారు.‘‘ఈ చర్చలతో మేం అలిసిపోయాం. ఎన్నికల్లో నిలబడి గెలవాలనేదే మా లక్ష్యం. ఇక టైం లేదు. మేం ఇండియా కూటమి భాగస్వాములం. అయితే, ఈ సీట్లను కూటమి మాకే కేటాయిస్తుందని ఆశిస్తున్నాం’’ అని సందీప్ పాఠక్ పేర్కొన్నారు.