విజయవాడ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్ కొట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్ చేజిక్కింది. అంతే వైట్ నాట్ ఏపీ? అంటూ రాహుల్ గాంధీ బెల్ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్ మాట రీసౌండ్ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్ ఎఫైర్స్ విూటింగ్, ఇలా చాన్నాళ్ల తరువాత ఢల్లీితో ఫోన్`ఇన్‌ల పర్వం మొదలైంది.రాహుల్ ఏపీపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో రీసెంట్ టైమ్‌లో యాక్టివిటీ పెరిగింది. అందుకు నిదర్శనంగా హైకమాండ్ నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలకు లేటెస్ట్‌గ పిలుపు వచ్చింది. డిసెంబర్ 27న ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమాలోచనలు జరుగనున్నాయి. ఏపీపై రాహుల్ స్పెషల్ ఫోకస్ పెట్టారనదీ క్లియర్. మరి ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రధాన అజెండాగా ఉండబోతుందా? కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. ఏపీలో ఎన్ని గ్యారెంటీలు ఉంటాయి..? అనేదీ ఆసక్తికరంగా మారింది.కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ ప్రియాంక విస్తృతంగా పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూడా రాహుల్. ప్రియాంక పర్యటనలు ఉంటాయని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఇప్పటికే చెప్పారు. రాహుల్ దిశా నిర్దేశంతో ఏపీ కాంగ్రెస్‌లో చాన్నాళ్ల తరువాత జోష్ కన్పిస్తోంది. ఏపీలో కాంగ్రెస్? సెంట్రల్‌లో ఇండియా కూటమి గెలుపు ఖాయమనే ధీమా విన్పిస్తోందిలా. ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరొగచ్చిన ఉండవల్లి నుంచి పాజిటివ్ వైబ్స్ , కామ్రేడ్ నారాయణ పొత్తు రాగం తెరపైకి రానే వచ్చాయి.మొత్తానికి చాన్నాళ్ల తరువాత ఏపీ కాంగ్రెస్ చర్చల్లో తళుక్కుమంటోంది. ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి భాగస్వాములతో అల్రెడీ రూట్ మ్యాప్ ఖరారైందా? ఆ డైరెక్షన్‌లో సాగాలని డిసెంబర్ 27న ఢల్లీి జరిగే విూటింగ్‌లో దిశా నిర్దేశం చేయనున్నారా? పొత్తులు సహా ఏపీలో ఎన్ని గ్యారెంటీలు.. అందులో స్పెషల్ స్టేటస్ ప్రాధాన్యంగా ఉండబోతుందా? అనే చర్చ జరుగుతోంది.