విజయవాడ, డిసెంబర్‌ 14: 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి కేశినేని నాని టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి గెలిచిన తర్వాత కేశినేని నాని వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. కేశినేని చిన్ని జనసేనలో చేరినున్నారా? టిడిపిలో ఛాన్స్‌ లేదని భావిస్తున్నారా? అందుకే పక్క చూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్‌ తో భేటీ కావడం అనుమానాలు ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చిన్ని యాక్టివ్‌ గా ఉండేవారు. ఒకానొక దశలో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. అటు లోకేష్‌ తో సైతం సన్నిహితంగా మెలిగే వారు. దీంతో విజయవాడ పార్లమెంటు స్థానం చిన్నిదేనని కామెంట్స్‌ వినిపించాయి. అటువంటి నాయకుడు పవన్‌ తో సమావేశం కావడం రకరకాల చర్చకు కారణం అవుతుంది.2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి కేశినేని నాని టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి గెలిచిన తర్వాత కేశినేని నాని వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. స్థానిక టిడిపి నాయకులతో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఎంపీ కేశినేని నాని సైతం స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు హీట్‌ ఎక్కాయి. కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళతారని టాక్‌ నడిచింది. లోకేష్‌ పాదయాత్రకు హాజరుకాని నాని.. చంద్రబాబు కార్యక్రమాలలో మాత్రం పాల్గొనేవారు. చంద్రబాబు అరెస్టు తరువాత విజయవాడ టిడిపిలో రాజకీయాలు గాడిన పడ్డాయి. తిరిగి ఎంపి కేశినేని నాని యాక్టివ్‌ అయ్యారు.ఇటువంటి తరుణంలో కేశినేని చిన్ని పవన్‌ కళ్యాణ్‌ ను కలవడం ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన టిడిపి నేత హోదాలోనే పవన్‌ ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో టిడిపి విషయంలో చిన్నికి ఛాన్స్‌ లేదు. కేశినేని నాని తిరిగి యాక్టివ్‌ కావడంతో.. ఆయనకు మూడోసారి ఎంపీ సీటు దక్కడం ఖాయం. దీంతో చిన్ని పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరితే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన మనసులో ఉన్న మాటను పవన్‌ కళ్యాణ్‌ కు చెప్పేందుకే చిన్ని కలిశారని టాక్‌ నడుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సలహా ఉంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.టిడిపి జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోదించాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకున్నా.. జనసేనకు లభించే సీట్లలో మాత్రం గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఇవ్వాలని పవన్‌ భావిస్తున్నారు. 2014లో టిడిపిలోకి రావాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ భావించారు. ఆయన పవన్‌ కు సన్నిహితుడు. దీంతో ఆయన చంద్రబాబుకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా కామినేని శ్రీనివాస్‌ ను బిజెపిలో చేర్పించారు. పొత్తులో భాగంగా బిజెపికి కామినేని ఆశిస్తున్న నియోజకవర్గాన్ని విడిచిపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిని చేశారు. ఇప్పుడు అదే ఫార్ములా ను కొనసాగించేందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. బలమైన నేతలుగా ఉండి టిడిపిలో చోటు దక్కని వారికి జనసేనలోకి పంపించి టికెట్లు కేటాయిస్తారని టాక్‌ నడుస్తోంది. అయితే తాను పవన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశానని.. అందులో ఎటువంటి రాజకీయం లేదని చిన్ని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *