నూజివీడు: పేదల భూములపై వారికి సర్వ హక్కులు కల్పించింది విూ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తున్నామని, కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదని, పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,463.82 ఎకరాలకు సంబంధించి 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఇనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించారు.ఈ సందర్బంగా నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, సర్వే పూర్తౌెన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చుని, భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేశామని తెలిపారు. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని, అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని, చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించామన్నారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా గొప్పగా నిలబడే రోజుగా ఇది జరుగుతుందని, కారణం ఏంటంటే దశాబ్ధాలుగా కేవలం అనుభవదారులుగా ఉన్న రైతులకు, వారు సాగు చేసుకుంటున్న భూములపై చట్టబద్ధంగా హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగబోతోందని, ఇదొక్కటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరుగబోతోందని సీఎం జగన్‌ తెలిపారు. విూ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతున్న పనులను, 53 నెలల పరిపాలనను ఒకసారి గమనిస్తే.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ముందడుగులు పడుతున్నాయని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *