ఇరాన్ నవంబర్ 12: Ñఇజ్రాయేల్ ? హమాస్ పరస్పర దాడులతో పాలస్తీనా చిన్నాభిన్నమవుతోంది. గాజాతో పాటు పలు నగరాల్లో లక్షలాది మంది నిరాశ్రయులువుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయేల్ సైన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో జరిగిన అరబ్, ముస్లిం దేశాల నాయకుల సమావేశం వేదికగా.. పాలస్తీనాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయేల్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని ఆయన ముస్లిం దేశాలను కోరాడు. ‘గాజాలో ఆక్రమణలకు, నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయేల్ సైన్యాన్ని ఇస్లాం దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి. అంతేకాదు యూదులకు రాజకీయ, ఆర్థిక సంబంధాలకు ముగింపు పలకాలి. వాళ్లతో వ్యాపార కార్యకలాపాలను రద్దు చేసుకోవాలి’ అని ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఇజ్రాయేల్‌కు సైనిక, ఆర్థిక సహాయం అందిస్తున్న అమెరికాను ఆయన తప్పుపట్టారు. యూదులు వాడుతున్న యుద్ధ సామాగ్రి, ఇంధనం పూర్తిగా అమెరికాకు చెందినదే. గాజాలో జరుగుతున్న విధ్వంసకాండకు అమెరికానే కారణం అని ఇరాన్ అధ్యక్షుడు మండిపడ్డాడు.