అన్నమయ్య రాయచోటి డి సి బి ఆర్ కార్యాలయంలో ఊరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 2009 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ రవి. రవి గత కొద్ది కాలంగా అనారోగ్య బాధపడుతున్నాడు. తీవ్రమనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రవి మృతదేహం తరలించారు. తరువాత రవి మృతదేహాన్ని స్వగ్రామమైన కడప జిల్లా,పోరుమామిళ్లకు తరలించారు. పోలయీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.