చంద్రబాబు తలవంచడు, తల దించడు

`నీతి నిజాయితీయే ఆయన ఆయుధం

` ప్రజల తరఫున శాంతియుతంగా పోరాడాలని చెప్పారు

` రాష్ట్ర ప్రగతి`ప్రజాసంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు`పవన్‌ కళ్యాణ్‌ పొత్తు ప్రకటన

`త్వరలో భువనమ్మ ‘‘నిజం గెలవాలి‘‘ కార్యక్రమం

` నవంబర్‌ 1 నుంచి బాబు ష్యూరిటీ`భవిష్యత్తుకి గ్యారెంటీ పునః ప్రారంభం

` చంద్రబాబు కడిగిన ముత్యంలా త్వరలోనే బయటకొస్తారు

` అనంతరం యువగళం పాదయాత్ర మొదలవుతుంది

` టిడిపి`జనసేన 160 సీట్లు గెలవబోతోంది

` టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌
‘‘నా కలలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్‌, చంద్రబాబు, ముందు ఉండి పోరాడేవారు. ఇందిరాగాంధీ కక్ష కట్టి ఎన్టీఆర్‌ ని గద్దె దింపేస్తే, తెలుగుజాతి ఏకమై తెలుగుదేశం సైన్యమై పోరాడి నెలరోజుల్లో ఆయనని మళ్లీ సీఎంని చేశారు. నాటి పోరాటం వేరు, నేడు మనం చేసే పోరాటం వేరు. ఇప్పడు సైకో జగన్‌ అనే రాక్షసుడితో పోరాడుతున్నాం. తన కుటుంబాన్ని వదిలి ప్రజల కోసమే 45 ఏళ్లు పనిచేసిన నిస్వార్థ సేవకుడు చంద్రబాబుని వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ 43 రోజులు జైల్లో నిర్బంధించారు. ఆయనని ములాఖత్‌లలో కలిసినప్పుడు ఆయన నీతి` నిజాయితీతో కూడి ధైర్యం కనిపించంది. శాంతియుతంగా పోరాడండి, అరాచకపాలనని అంతమొందించేందుకు ప్రజల్ని చైతన్యం చేయండి అని పిలుపునిచ్చారు. సైకో జగన్‌ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు` పవన్‌ కళ్యాణ్‌ కలిసి పోరాడాలని నిశ్చయించుకున్నారు. టిడిపి`జనసేన కూటమి 160 సీట్లు గెలవబోతోంది. కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ`భవిష్యత్తుకి గ్యారెంటీ నవంబర్‌ ఒకటి నుంచి రాష్ట్రమంతా ప్రారంభం కానుంది. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆవేదనతో అశువులు బాసిన అభిమానుల కుటుంబాలని పరామర్శించి అండగా నిలిచేందుకు నా తల్లి భువనమ్మ త్వరలోనే ‘‘నిజం గెలవాలి‘‘ అనే కార్యక్రమం ద్వారా మృతుల కుటుంబీకులను పరామర్శిస్తారు. యువగళం పాదయాత్ర కూడా త్వరలోనే ఆరంభం అవుతుంది.‘‘ అని లోకేష్‌ వివరించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో శనివారం టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రసంగించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *