నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడుని కలిసిన
రాజంపేట పట్టణం/పార్లమెంట్ క్యాంపు కార్యాలయం.
🔸 రాజంపేటతో పాటు అన్నమయ్య జిల్లాలో ప్రజల త్రాగు,మరియు సాగు అవసరాలు తీర్చే అన్నమయ్య ప్రాజెక్టు,పింఛ,గాలేరు నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు కోరారు.
🔸 ఈమేరకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు గారిని కలిసి అన్నమయ్య జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల నీటి సమస్యలను ఆయన వారి దృష్టికి తీసుకెళ్లారు.
🔸 ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యానికి రాజంపేట ప్రజల కల్పవృక్షంగా ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నీటిపాలైందని,అలాగే పించా ప్రాజెక్టును కూడా అత్యాశపరులు పట్టణ పెట్టుకున్నారని,ఆ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని,గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య ప్రాజెక్టును కానీ, పించా ప్రాజెక్టును గాని వరద బాధితులను గాని తిరిగి పూర్వ వైభవానికి తెచ్చేందుకు ఆనాటి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదన్నారు.
🔸 అదేవిధంగా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నందున అతి త్వరలో అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల పునర్నిర్మాణం పనులను ప్రారంభించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగు,సాగు మీరు అందించే బాధ్యతను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని అన్నమయ్య జిల్లాలో అన్ని ప్రాంతాలకు వీలైనంత త్వరగా వివిధ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
🔸ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.