ఏలూరు:ఏలూరు రేంజ్‌ లో ఉన్న ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాజిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా, బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల ఎస్పీలతో డిజిపి ద్వారకా తిరుమలరావు బుధవారం నేర సవిూక్ష సమావేశం నిర్వహించారు.
డీజీపీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధన పై అవగాహన కల్పించాం. స్తుతం గంజాయి అక్రమ రవాణా అక్రమ వినియోగం గంజాయి నివారణపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాం. మైనర్‌ బాలికలపై
జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని అన్నారు, కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగింది అని అన్నారు.క్షేత్రస్థాయిలో బేసిక్‌ పోలీస్‌ బాగా చేయాలని కోరుకుంటున్నాం. పోలీస్‌ సిబ్బందితోపాటు ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు కూడా బేసిక్‌ పోలీసింగ్‌ చేసుకుంటూ ఉండాలి. సిబ్బంది యొక్క కొరతను అధిగమించుట కొరకు త్వరలో పోలీసులను రిక్రూట్‌ చేస్తాం, కొంత టైం పడుతుందపి అన్నారు.మహిళలు మరియు మైనర్‌ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు.
గంజాయి, మాదకద్రవ్యాల పై ప్రజలకు అన్ని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాలలో ఉన్న అన్ని స్కూళ్లు కాలేజీలు వద్ద విద్యార్థిని విద్యార్థులకు గంజాయి వలన కలిగే అనర్ధాలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పోలీసులు నైపుణ్యాలను పెంపోందించుకుని, పనితీరును మెరుగు పరుచుకోవాలని అన్నారు.ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లను విజయవాడ మరియు విశాఖపట్నంలోనే ఉన్నాయని సదరు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం కొరకు ముఖ్యమంత్రికి కి తెలియ పరచగా అయన అంగీకరించినారని, త్వరలోనే సైబర్‌ పోలీస్‌ స్టేషన్లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు.
కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్‌ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు జరిగినాయి.ఈ మధ్యకాలంలో నూజివీడు రూరల్‌ మండలం పల్లెరముడి గ్రామంలో ఒక మైనర్‌ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని పురస్కరించుకొని 48 గంటల లోపు ముద్దాయిని అరెస్టు చేసి ముద్దాయిని రిమాండ్‌ ఏలూరు జిల్లా పోలీస్‌ సిబ్బంది పంపించారని అన్నారు.
ఈ సమావేశానికి ఏలూరు రేంజ్‌ ఐజీ జి. వి.జి అశోక్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అష్మి, ర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహారావు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌ గంగాధర్‌ రావు, కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, , బి .ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *