పిఠాపురం:పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ముంపుప్రాంతాల్లో ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటించి,బాధితులను పరామర్శించారు.ఉదయం తాడేపల్లినుంచి హెలీకాఫ్టర్లో బయలుదేరిన ఆయన స్థానిక ఆర్.ఆర్.బీహెచ్.ఆర్.కాలేజ్ గ్రౌండుకి చేరుకున్నారు.వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతావిశ్వనాథ్,పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,వైసీపీ జిల్లా అధ్యక్షులు,నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.అక్కడ్నుంచి కారులో జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలైన మాధవపురం, ఇసుకకల్లి, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలు పర్యటించారు.జగన్మోహన్ రెడ్డి కొన్నిచోట్లకు ట్రాక్టర్ పైన,బోటులోను వెళ్ళారు.అలాగే.,మునిగిన పంటపొలాల్లోకి దిగి,పాడైపోయిన పంటను పరిశీలించారు.రైతులను పరామర్శించారు.వారి కష్టాలు విన్నారు.అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.అలాగే వరద నీటిలో పడిన ఇబ్బందులను బాధిత ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు.ఈ పర్యటనలో ప్రతీచోట ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పట్టి,ఘనంగా స్వాగతం పలికారు.