అళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో గవర్నమెంట్ హస్పెటల్ లో హస్పెటల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గోన్నారు.
అఖిల ప్రియ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత హస్పెటల్ నూతనంగా కమిటీ ఏర్పాటు చేసారు. 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం లో మేము హస్పెటల్ డెవలప్మెంట్ కు 5 లక్షల రూపాయలు మేము హాస్పిటల్ కి ఇచ్చేవాళ్లం ప్రభుత్వం తరుపున. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు లక్షలు మాత్రమే ఇచ్చేవారు అది కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు లాస్ట్ రెండు సంవత్సరాలు హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఎటువంటి నిధులు కేటాయించలేదని అన్నారు. ఏమైనా అంటే ఆళ్లగడ్డ కు 50 పడకల హస్పెటల్ తెచ్చాము అంటారు కేవలం ముందర పక్క మాత్రం డెవలప్మెంట్ చేసి వెనకాల అలాగే వదిలేశారు. ఇప్పుడు చెప్తున్న త్వరలో ఆళ్లగడ్డ కు 100 పడకల హస్పెటల్ తీసుకొస్తాను అని హావిూ ఇచ్చారు.బిజెపి నుండి వైసీపీకి వచ్చి వైసీపీలో ఎమ్మెల్యేగాఉండి ఆళ్లగడ్డ ప్రజలకు ఏమి చేయని వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా. మేం ఏదో అరాచకాల అవినీతులు చేస్తున్నాము అని అంటున్నారు మేము ఆర్డీవో స్థాయిలో ఎంక్వయిరీ పెట్టించబోతున్నాము అప్పుడు అబద్ధాలు అని తెలిస్తే తప్పుడు కూతలు కూసిన వారిపై కేసులు పెడతామని అన్నారు.ఆళ్లగడ్డ ప్రజలను గాని వ్యాపారస్తులను గాని ఎవరినైనా మా పేర్లు చెప్పి బెదిరిస్తే మా దృష్టికి తీసుకొని రండి అది ఎవరైనా మేము సహించమని హెచ్చరించారు