రాయచోటి న్యూస్ : మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ సూచనల మేరకు రాయచోటి అర్బన్ సిఐ, రూరల్ సిఐలుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్, వర ప్రసాద్ లను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐలను సమితి సభ్యులు దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముస్లిం యువత సన్మార్గంలో నడిచేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించడం జరిగింది. ఇందుకు సిఐలు పారదర్శకంగా స్పందించి రాయచోటిలో ఎక్కువ శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అలాగే మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రస్తుత సమాజంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పాత్ర ఎంతో ఉందని సమితి సభ్యులను అభినందించారు. పట్టణంలో మైనారిటీల ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, అందుకు పోలీస్ శాఖ సహకారం ఉంటుందని సిఐలు తెలిపారు. స్నేహ పూరిత వాతావరణం కోసం సమితి సభ్యుల సహకారం అవసరమని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర మీడియా సమన్వయకర్త అన్వర్, సిద్దిఖ్, యహియా, ఇర్షాద్ ఖాన్, అబ్దుల్ రహీమ్, మహబూబ్ బాష, గోరి హబీబ్, ఆసిఫ్, నిజాం, జాకీర్ లు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *