నల్గోండ, ఆగస్టు 16 : టా ఒకేరకమైన పంటలు సాగు చేయడం వలన దిగుబడి తగ్గుపోతోంది. దీంతో దిగుబడి కోసం రైతులు ఇష్టానుసారం రసాయన మందులు వాడడంతో భూమి నిస్సారం అవుతోంది. దీంతో సాగులో నష్టాలు వస్తున్నాయని చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు సాగు వదిలేసి ఇతర పనులు చూసుకుంటున్నారు. పట్టణాలకు వలస పోతున్నారు. ఈ తరుణంలో కొంతమంది రైతుల వినూత్న పద్ధతిలో పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో, తక్కువ మోతాదులో ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి, లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయాధికారుల సహకారం, సాంకేతిక పరిజ్ఞానంతో పంటల పండిస్తున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రైతు నీటి వసతి అంతగా లేని తన పొలంలో సంప్రదాయ పంటలకు భిన్నంగా వ్యవసాయం చేస్తున్నాడు. నీటి వసతి లేదని సాగును వదిలేసే రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరువు ప్రాంతంలో ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగం.. ఇప్పుడు వారి ఇంట సిరులు కురిపిస్తుంది. సుమారు 33 ఏళ్లుగా ఆదాయం పొందుతున్నాడు. అది కూడా ఎకరాకు రూ.13 లక్షలు. ఎక్కువ సాగుభూమి ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు చాలా మంది తమ పొలాలను బీడుగా వదిలేస్తారు. నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి మాత్రం నీటి వసతి లేకపోయినా ఎకరాకు కేవలం రూ.5 వేల పెట్టుడితో 33 ఏళ్లుగా ఎకరాకు రూ.13 లక్షల ఆదాయం పొందుతున్నాడు. 12 ఎకరాల్లో పంట పండిస్తూ భారీగా ఆదాయం పొందుతున్నాడు. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1,200 కుంకుడు మొక్కలు నాటాడు పద్మారెడ్డి. అప్పుడు అందరు ఆయనను పిచ్చివాడిలా చూశారు. కానీ ఇప్పుడు అదే కుంకుడు తోట విూద ఆయన లక్షల రూపాయల ఆదాయం ఆర్జించడం చూసి నోరె వెల్లబెడుతున్నారు.పద్మారెడ్డి 1991 లో నీటి వసతి పెద్దగా లేని తన 12 ఎకరాల వ్యవసాయ భూమిలో 1,200 కుంకుడు మొక్కలు నాటించాడు. ఇందుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేశాడు. వీటి సాగుకు పెద్దగా నీటి అవసరం లేదు. అందుకే పద్మారెడ్డి ఈ ఆలోచన చేశారు. ఆ చెట్లు పెరిగి పెద్దయి నాలుగేళ్ల తర్వాతి నుంచే దిగుబడి ఇవ్వడం మొదలైంది. ఒక్కసారి నాటిన వీఇని మూడు నాలుగేళ్లు శ్రద్ధగా కాపాడుకున్నాడు. ఆ తర్వాత నుంచి అతను ఊహించని విధంగా ఆదాయం వస్తోంది.కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడిరచాడు. సాగు విధానం గురించి ఆయన చాలా మందికి సూచనలు చేస్తున్నారు. మొక్కల మధ్య 20చీ20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలంటున్నాడు. వీటికి డ్రిప్తో నీటిని అందిస్తే సరిపోతుంది అంటున్నాడు. అంతేకాక కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొప్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది అంటున్నారు. పంట వేసిన నాలుగో ఏట నుంచి 20?30 కిలోల కాపు ప్రారంభమవుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుందని తెలిపారు పద్మారెడ్డి.ఏటా కుంకుడు పంట నవంబర్ ? డిసెంబర్ నెలల మధ్య పూతకు వస్తుంది. ఏప్రిల్లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20?25 కిలోల ఆకులు రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి. కుంకుడు మొక్కలను ఒక్కసారి నాటితే సుమారు 200 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయి. కిలో ఎండు కుంకుడు కాయలు రూ.130 పలుకుతోంది. నాణ్యమైన పొడికి మరింత డిమాండ్ ఉందని పద్మారెడ్డి తెలిపాడు.