విజయవాడ:అక్టోబర్ 05: స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు గురువారం విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు, బెయిల్ మంజూర్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు బుధవారం నుంచి హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. కోర్టులో నేడు విచారణ ముగిసి కీలక తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.కాగా బుధవారం కీలక వాదనలు జరిగాయి.స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబుపై నేరారోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను చూపించండి. నిధుల విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఉందా? అప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఎవరు?’’ అని స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రెండేళ్ల క్రితం జరిగిన దర్యాప్తునకు, ప్రస్తుతం జరిగిన దర్యాప్తునకు పెద్దగా తేడా లేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదు? అని అడిగిన విషయం తెలిసిందే. మరి నేడు వాదనలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.