హైదరాబాద్, జూన్ 1: ప్రాణాలను కాపాడే ఆ మందులను కూడా కొన్ని ముఠాలు నకిలీ చేస్తున్నాయి. ఇలా పలు క్యాన్సర్ మందులకు నకిలీలు తయారుచేసి, మార్కెట్లో సరఫరా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు రట్టు చేశారు. రెండు నెలలుగా డీసీఏ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్‌కు కూడా కేటుగాళ్లు నకిలీ మందులు తయారుచేయటం తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఇవిగాక కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతిలేని మెడికల్ షాపుదారుల దురాశ కూడా రోగుల జేబులను, ఒంటినీ గుల్లచేస్తోంది. ఈ కల్తీ మందుల మాఫియా విూద తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే క్రమంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో బిత్తరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కల్తీ మందుల్లో కొన్ని ఇక్కడే తయారవుతుండగా, మరికొన్ని ఉత్తరాది నుంచి దిగుమతి అవుతున్నాయి.
హైదరాబాద్‌లో పట్టుబడిన మందుల్లో మెజారిటీ హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్‌లో తయారైనవవిగా అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి కొరియర్ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించేవి ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు డూప్లికేట్ మందులను తయారుచేసి, చక్కని లేబుల్‌తో వీటిని విక్రయిస్తున్నారు.రాష్ట్రంలో లైసెన్సు లేకుండానే అనేక మెడికల్ షాపులు నడుస్తున్నట్లు తనిఖీల్లో బయటపడుతోంది. రాజధాని నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి. మరోవైపు వివిధ నర్సింగ్‌హోంలు కూడా ఎలాంటి లైసెన్స్ లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు. ఈ నకిలీ మందుల మాఫియాలు మందుల షాపులకు పెద్ద మొత్తంలో కమిషన్ ఎరవేసి, ఈ మందులను అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు విచారణలో అధికారుల దృష్టికి వచ్చింది. నకిలీ మందుల కంపెనీలు, మందుల షాపులు, ఏజెంట్లు.. ఇలా వీరంతా ఒక్కటై జనం ఒళ్లు గుల్లచేస్తున్నారు.
అసలు మందుల కంటే కల్తీ మందుల ధర మూడో వంతు ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించారు. ఈ ముఠాలు మందులపై 40 శాతం అధిక ధరలు ముద్రించి వాటిపై భారీ కమిషన్‌ను మందుల షాపుకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఈ అధిక ధరల అంశంపై తాజాగా అధికారులు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. రూ.113.60 విలువైన వాస్ఫిన్`ఓ 5 ఎంజీ ఆయింట్మెంట్ను హైదరాబాద్‌లోని బీరంగూడ, మల్కాజిగిరిలో రూ.140కి అమ్మటం, ఇట్రాకాప్`200 పది మాత్రలకు రూ.247.70 తీసుకోవాల్సి ఉండగా రూ.285కి అమ్మటాన్ని కూడా అధికారులు గుర్తించారు.చిన్నా చితకా రోగాల మందుల్లో పెద్దగా లాభాలు రావనుకున్నారో ఏమోగానీ, కేటుగాళ్లు ఏకంగా కేన్సర్ మందులకూ నకిలీలు చేయటం మొదలుపెట్టారు. అల్లోపతి మందులతో బాటు ఆయుర్వేద మందులనూ కుటీర పరిశ్రమలో వస్తువులు చేసినట్లుగా చేయటాన్ని చూసి తనిఖీ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. వీరిలో కొందరు ఫుడ్‌లైసెన్స్ అనుమతి తీసుకుని మందులు తయారుచేయటం గమనార్హం. ఇవిగాక, అక్రమంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వహణ, అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం, బిల్లుల్లేకుండానే మందులు అమ్మటం, భారీగా మందులు నిల్వచేయటం వంటి అక్రమాలు అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల ముఠా
హైదరాబాద్, జూన్ 1
ప్రాణాలను కాపాడే ఆ మందులను కూడా కొన్ని ముఠాలు నకిలీ చేస్తున్నాయి. ఇలా పలు క్యాన్సర్ మందులకు నకిలీలు తయారుచేసి, మార్కెట్లో సరఫరా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు రట్టు చేశారు. రెండు నెలలుగా డీసీఏ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్‌కు కూడా కేటుగాళ్లు నకిలీ మందులు తయారుచేయటం తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఇవిగాక కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతిలేని మెడికల్ షాపుదారుల దురాశ కూడా రోగుల జేబులను, ఒంటినీ గుల్లచేస్తోంది. ఈ కల్తీ మందుల మాఫియా విూద తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే క్రమంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో బిత్తరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కల్తీ మందుల్లో కొన్ని ఇక్కడే తయారవుతుండగా, మరికొన్ని ఉత్తరాది నుంచి దిగుమతి అవుతున్నాయి.
హైదరాబాద్‌లో పట్టుబడిన మందుల్లో మెజారిటీ హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్‌లో తయారైనవవిగా అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి కొరియర్ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించేవి ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు డూప్లికేట్ మందులను తయారుచేసి, చక్కని లేబుల్‌తో వీటిని విక్రయిస్తున్నారు.రాష్ట్రంలో లైసెన్సు లేకుండానే అనేక మెడికల్ షాపులు నడుస్తున్నట్లు తనిఖీల్లో బయటపడుతోంది. రాజధాని నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి. మరోవైపు వివిధ నర్సింగ్‌హోంలు కూడా ఎలాంటి లైసెన్స్ లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు. ఈ నకిలీ మందుల మాఫియాలు మందుల షాపులకు పెద్ద మొత్తంలో కమిషన్ ఎరవేసి, ఈ మందులను అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు విచారణలో అధికారుల దృష్టికి వచ్చింది. నకిలీ మందుల కంపెనీలు, మందుల షాపులు, ఏజెంట్లు.. ఇలా వీరంతా ఒక్కటై జనం ఒళ్లు గుల్లచేస్తున్నారు.
అసలు మందుల కంటే కల్తీ మందుల ధర మూడో వంతు ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించారు. ఈ ముఠాలు మందులపై 40 శాతం అధిక ధరలు ముద్రించి వాటిపై భారీ కమిషన్‌ను మందుల షాపుకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఈ అధిక ధరల అంశంపై తాజాగా అధికారులు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. రూ.113.60 విలువైన వాస్ఫిన్`ఓ 5 ఎంజీ ఆయింట్మెంట్ను హైదరాబాద్‌లోని బీరంగూడ, మల్కాజిగిరిలో రూ.140కి అమ్మటం, ఇట్రాకాప్`200 పది మాత్రలకు రూ.247.70 తీసుకోవాల్సి ఉండగా రూ.285కి అమ్మటాన్ని కూడా అధికారులు గుర్తించారు.చిన్నా చితకా రోగాల మందుల్లో పెద్దగా లాభాలు రావనుకున్నారో ఏమోగానీ, కేటుగాళ్లు ఏకంగా కేన్సర్ మందులకూ నకిలీలు చేయటం మొదలుపెట్టారు. అల్లోపతి మందులతో బాటు ఆయుర్వేద మందులనూ కుటీర పరిశ్రమలో వస్తువులు చేసినట్లుగా చేయటాన్ని చూసి తనిఖీ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. వీరిలో కొందరు ఫుడ్‌లైసెన్స్ అనుమతి తీసుకుని మందులు తయారుచేయటం గమనార్హం. ఇవిగాక, అక్రమంగా బ్లడ్‌బ్యాంకుల నిర్వహణ, అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం, బిల్లుల్లేకుండానే మందులు అమ్మటం, భారీగా మందులు నిల్వచేయటం వంటి అక్రమాలు అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి.