భద్రాద్రి కొత్తగూడెం:మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో బస్తర్‌ లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండిరచాలని పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం,అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ లేఖ విడుదల చేసారు. అమాయక ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో దొరకబట్టి చంపుతున్నారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో మృతి చెందిన 103 మందిలో 60 మంది మహిళలు వృద్ధులే ఉన్నారని లేఖలో పేర్కోన్నారు. ఆదివాసీల త్యాగాలతో రక్తంతో తడచిన అడవులలో రహదారులు వేస్తూ అపారమైన అటవీ సంపదను తరలిస్తున్నారు. గత ఏడాదికాలంగా చతిస్గడ్‌ అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తూ ఆదివాసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో ఆదివాసి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఆదివాసీలకు న్యాయం జరగడంలేదు. కగార్‌ దాడిలో భాగంగా ప్రజలపై క్రూరమైన దాడి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక, కర్షక,మేధావి, విద్యార్ధి, మహిళా వర్గాలకు పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *