2019 కి మించి ఈ సారి ప్రభంజనమా
విజయవాడ: గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించడంపై ఎ.పి లో పెద్ద చర్చ జరుగుతోంది. ఐ ప్యాక్‌ టీమ్‌ ను ఉద్దేశించి జగన్‌ చేసిన ప్రకటనతో అటు కూటమిలో అంతర్మధనం ప్రారంభమైంది. అసలు జగన్‌ ధీమాకు కారణాలు ఏంటి.. ఓటింగ్‌ శాతం పెరగడమేనా అని చర్చించుకుంటున్నారు. 2019 కి మించి ఈ సారి ప్రభంజనం ఎలా సాధ్యం అనే విూమాంస కూడా ప్రారభమైంది.
ఎవరెన్ని చెబుతున్నా జగన్‌ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌ గా కనిపిస్తున్నారు. ఐ ప్యాక్‌ వాళ్లతో జరిగిన విూటింగ్‌ లోనూ మనదే ప్రభంజనం అని చెబుతున్నారు. కాపులు, బీసీలు, ఎస్సీ ,ఎస్టీలు.,మైనారిటీలు తమ వైపే ఉన్నారని ధీమాగా చెబుతున్నారు. వైసీపి వాళ్ల లెక్కలు కూడా కొంత క్లారిటీతో ఉన్నాయి.
వైసీపీ ధీమాకు విశ్షేషకులు పలు కారణాలు చెబుతున్నారు. వైఎస్సార్‌ హయాంలో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేదా.. అని ప్రశ్నిస్తున్నారు. 2004 లో వైఎస్సార్‌ నాయకత్వంలో కాంగ్రెస పార్టీకీ 69.8 శాతం పోలింగ్‌ జరిగింది. వై ఎస్సార్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మళ్లీ 2009 లో పోలింగ్‌ శాతం పెరిగి 72.7 శాతానికి చేరుకుంది. ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకతే అనే మాటలు వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా మళ్లీ కాంగ్రెస్‌ గెలిచింది. మళ్లీ వైఎస్సార్‌ ముఖ్య మంత్ర పదవి చేపట్టారు. ఇలా ప్రజలకు మంచి చేస్తే పాజిటివ్‌ ఓటు పెరుగుతుందని నాడు నిరూపణ అయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎ.పి లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని జగన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మహిళల ఓటింగ్‌ శాతం పెరగడం అనేది ఆంధ్ర ప్రదేశ్‌ లో చర్చనీయాంశం అయింది. మహిళలకు తాము ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ వల్ల వారంతా మూకుమ్మడిగా వచ్చి ఓట్లు వేశారని టిడిపి వర్గాలు సంబరపడుతుండగా.,అదేవిూ కాదనీ తాము చేసిన సాయానికి కృతజ్ఞతా పూర్వకంగా వచ్చారని వైసీపి బల్లగుద్ది మరీ చెబుతోంది. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా తమదేననీ., అందుకే మహిళలు అంతగా వచ్చి ఓటింగ్‌ లో పాల్గొన్నారని విశ్లేషిస్తున్నారు.
బీసీల కోసం ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటి చేసినందున అటు 50 శాతం వరకూ బీ సీలు వైసీపీ కి అనుకూలంగా ఉన్నారని భావిస్తున్నారు. మైనారిటీలు అయితే మతత్వ బిజెపి కూటమికి దూరంగా ఉంటారు గనుక ఆ ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయన్నది వారి వాదన. ఇలా 60 నియోజకవర్గాలలో మైనారిటీల ఓటు బ్యాంకు ఉన్న నేపధ్యంలో ఆ ఓట్లన్నీ కూడా తమకే పడుతుందన్నది వైసీపీ వర్గాల నమ్మకంగా కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *