ఒంగోలు, మే 1 :సముద్ర తీరంలో సంపద సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సముద్ర తీరంలో లాజిస్టిక్స్ ఎగుమతుల, దిగుమతుల పనులు సులువు చేసేందుకు .. తీర ప్రాంతాలలో.. కొత్త పోర్టులు, హార్బర్లు నిర్మాణ పనులను చేపట్టింది.. ఇలా తీర ప్రాంతాలలో పోర్టులు నిర్మించడం ద్వారా .. రాష్ట్ర అభివృద్ధితో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఉపాధి కార్యక్రమాలను చెప్పట్టారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా సుమారు రూ.20,000 వేల కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది ఏపీ సర్కార్. అందుకోసం ఒకేసారి రాష్ట్రంలో.. గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు.. 10 మినీ పోర్టుల రూపంలో షిప్పింగ్ హార్బర్స్ ను కూడా అభివృద్ధి చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచుతోంది.ఈ క్రమంలో రాష్ట్రంలోని 974 కి.విూ సుదీర్ఘ ప్రాంతంలో ప్రతి 50 కి.విూ కు ఒక పోర్టును లేదా ఒక షిప్పింగ్ హార్బర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖలో ఉన్న మేజర్ పోర్టులతో పాటు.. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా.. అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభించారు. అనుకున్న విధంగా కేవలం 18 నెలలోనే ఈ పోర్టును సిద్ధం చేసి చూపించారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్టు ఫేస్`1 పనులు పూర్తయ్యాయి. ఇక రామాయపట్నం పోర్ట్ దాదాపుగా వాణిజ్యపరంగా.. కార్య కలాపాలు ప్రారంభించడానికి సర్వం సిద్ధం అయినట్లే. కేవలం 18 నెలలలోనే ఈ పోర్ట్ పనులు పూర్తి చేసి చూపించారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా సాగే పనులన్నీ కూడా ఎంత వేగంగా కొనసాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఇక రామాయపట్నం పోర్టు విషయానికొస్తే.. ఈ పోర్టు సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో.. రూ. 4,902 కోట్ల పెట్టుబడితో ఈ పోర్టును అభివృద్ధి చేశారు. 2022 జూన్ లో ఈ పోర్ట్ నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మొదటి దశలో.. 34.04 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్ సామర్ధ్యంతో.. ఫేస్`1లో నాలుగు బెర్తులు అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్స్సైజ్ , కస్టమ్స్ బిల్డింగ్ పనులు కూడా పూర్తవడంతో.. త్వరలోనే తొలి నౌకను తీసుకువచ్చి.. వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. భారీ ఓడలను తీరానికి సురక్షితంగా తీసుకుని వచ్చేలా .. 7.87 మిలియన్ క్యూబిక్ విూటర్ల డ్రెడ్జింగ్ , టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ ఛానల్ ను నిర్మించారు. అనుకున్న విధంగా కేవలం 18 నెలలలోనే రామాయపట్నం పోర్టు ఫేస్`1 పూర్తి చేసి చూపించారు. ఇక అతి త్వరలోనే ఈ పోర్టుకు సంబంధించిన మిగిలిన పనులను కూడా .. వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నారు