నరసాపురం, మార్చి 27: ఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. నాలుగున్నరేళ్లుగా ఆయన వైఎస్ఆర్సీపీపై, జగన్ మోహన్ రెడ్డిపై పోరాడారు. సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏదో ఓ కేసులో అరెస్టు చేసి హింసిస్తారన్న కారణంగా ఇటీవలి కాలం వరకూ ఆయన సొంత నియోజకవర్గానికీ వెళ్లలేకపోయారు. అప్పటికే ఆయన పుట్టిన రోజున విూడియాలో రోజూ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు కూడా. తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని.. ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ రాజకీయం ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్థమైపోయింది. బీజేపీ నుంచి టిక్కెట్ దక్కలేదు. బీజేపీ విషయంలో ఆయనకు ఇదే మొదటి ఎక్స్ పీరియన్స్ కాదు. 2014లోనూ అంతే. తనకే టిక్కెట్ వస్తుందని అనుకుంటే.. గోకరాజు గంగరాజుకు ఆరెస్సెస్ మద్దతు టిక్కెట్ దక్కించుకున్నారు. అప్పుడు ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి ఈ సారి కూడా ఆయన ఎన్నికకు దూరమవుతారా ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ నుంచి గెలుపొంది, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాటకు ముందు ఒంటి కాలిపై లేచే సిట్టింగ్ ఎంపి రఘురామ కృష్ణమరాజుకు ఈ సారి టికెట్ దక్కక పోవడం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి కానీ బిజెపీ నుంచి కానీ తనకు సీటు దక్కుతుందని, తిరిగి నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన రఘురామకృష్ణం రాజుకు ఆ పార్టీలు మొండి చేయి చూపడంతో ఆ షాక్ నుంచి ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. బిజెపీ ఆదివారం ప్రకటించిన ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాలో కే రఘురామకృష్ణంరాజుకు సీటు దక్క లేదు. నరసాపురం పార్లమెంట్ టెకెట్‌ను బిజెపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించింది. రాజమండ్రి స్థానాన్ని బిజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, రాజంపేట సీటును మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, అరకు పార్లమెంట్ స్థానాన్ని గీతకు, అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్‌కు, తిరుపతి ఎంపి సీటును వరప్రసాద్‌కు కేటాయించినట్లు పేర్లను ప్రకటించింది.రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌తోనే ప్రారంభమైంది. కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిపై చాలా విమర్శలు చేసి బయటకు వచ్చారు. బీజేపీలో చేరారు. కానీ 2014లో ఆయనకు సీటు దక్క లేదు. 2018లో బిజెపీ నుంచి టీడీపీలో చేరారు. ప్రసాంత్ కిషోర్ మద్యవర్తిత్వం చేయడంతో.. మళ్లీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019 మార్చిలో ఆయన వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ సీటు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి వెంకట శివరామరాజుపై దాదాపు 31వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత వైసీపీలో ఉన్న తీవ్రమైన కట్టడి పరిస్థితుల్లో ఆయన ఇమడలేకపోయారు. ఎవర్ని కలవాలన్నా విజయసాయిరెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. పార్లమెంట్ లో మాట్లాడాలన్నా.. వైసీపీ తరపున ప్రశ్నలు అడగాలన్నా విజయసాయిరెడ్డి పర్మి,న్ తసుకోవాలి. ఈ పద్దతుల్ని ఆయన యథేచ్చగా ఉల్లంఘించారు. తెలుగు విూడియాను ఏపీలో రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాతృభాష గురించి పార్లమెంట్ లో మాట్లాడటంతో వైసీపీకి, రఘురామకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. చివరికి రెబల్ గా మారారు. సీఎం జగన్ వ్యక్తిగతంగా తీసుకోవడంతో ఆ వైరం ప్రతిష్టాత్మకంగా మారింది.ఎట్టి పరిస్థితుల్లోను రానున్న ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి నా సత్తా ఏమిటో చూపిస్తానని పలుమార్లు చాలంజ్ విసిరారు. జగన్ ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులో సందేహం లేదు. ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అంటే.. ప్రాణాలుక తెగించి జగన్ పై పోరాడిన నేతకు గౌరవం ఇవ్వడమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో అనేక సవిూకరణాలు చూసుకుంటోంది. నర్సాపురం తప్ప రఘురామకు సరిపోయే సీటు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయనను అసెంబ్లీకి తీసుకు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం టీడీపీలో జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏదో ఓ నియోజకవర్గం నుంచి.. ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఆలోచన టీడీపీ అధినేతలో ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికే అన్నిసీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు సీటు సర్దుబాటు చేయాలంటే.. కొంత మందికి సర్ది చెప్పాల్సి ఉంటుంది.పశ్చిమగోదావరిలో రఘురామకు అనువైన సీటు ఉండి నియోజకవర్గం. అది టీడీపీ కంచుకోటగా ఉంది. ప్రస్తుతం రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో సారి పోటీ చేస్తున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి మధ్య పంచాయతీని తీర్చడానికి రఘురామకు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే ఇద్దర్నీ ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నిక్లల్లో పోటీ చేసి తీరుతానని రఘురామకృష్ణరాజు అంటున్నారు. టీడీపీ సీటు ఇస్తే ఆ పార్టీ తరపున పోటీ చేయాలి.. లేకపోతే స్వతంత్రంగా పోటీ చేయాలి.కానీ రఘురామకు అంతకు మించిన ఆప్షన్ ఉంది.. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకుని కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన రఘురామ వియ్యంకుడు కూడా. రఘురామకు ఉన్న క్రేజ్.. ఆయన కాన్పిడెన్స్.. ప్రకారం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. నర్సాపురంలో గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ అంత పలుకుబడి ఉన్న వారు కాకపోవడం.. రఘురామ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యే చాన్స్ ఉంది. అది ఆయనకు ప్లస్ అవుతుంది. రఘురామరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.