ఆలీబాబా నలబై దొంగలు.. కాదు కాదు ఆలీబాబా నకిలీ విలేఖరులు
ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో నకిలీ రిపోర్టర్ల బాగోతం
హైదరాబాద్‌ మార్చ్‌ 25: కష్టపడకుండా కాసులు వసూలు చేయడం ఈ గ్యాంగ్‌ హాబీ పట్టుకోవాల్సిన పోలీసులు వీరే ఒరిజినల్‌ అనుకొని నమ్మి దోస్తానంతో వీరితో ఫోటోలు దిగుతున్నారు.వీళ్ల నిజ స్వరూపం తెలిస్తే ‘‘ పునుపు ‘‘ పాపక ఊరుకోరు మరి.వసూళ్ల దందా.. అక్రిడేషన్ల దందా.. ఐడి కార్డుల దందా.. బ్లాక్‌ మెయిల్‌ దందా.. వగైరా.. వగైరా.. అన్ని వీరి నిత్య కృత్యాలు.వార్తలు రాసే దమ్ము లేని సవట దద్దమ్మలు,దౌర్భాగ్యులు ఈ దందాలో మాత్రం బహు నిష్టాతులు. ఒకడికి ఇంట్లో నాలుగు నుండి ఐదు అక్రిడేషన్‌, అలాగే ఐడి కార్డులు భార్య బిడ్డలు కొడుకులు మరియు బంధువులు అన్ని వసూలు చేసే డబ్బులతో కొనుక్కున్నవే, ఇందులో కొన్ని వారి దాష్టిక నైపుణ్యం ప్రదర్శించి తయారు చేసిన ఫేక్‌ కార్డ్స్‌ ఇది పోలీసులు పరిశీలిస్తే బయటపడుతుంది. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ పవిత్రమైన పాత్రికేయ వృత్తి పరువు తీసే కార్యం ఎల్గ పెడుతున్నారు.ఈ నకిలీలు
నాలుగు గ్రూపులుగా తయారై రాష్ట్ర నలుమూలల చిన్నా పెద్ద వ్యాపారులను, రాజకీయ నాయకులను, అధికారులను,చివరికి సామాన్యుని సైతం వదలకుండా బురిడీ కొట్టించి మేమే ఒర్జినల్‌ రిపోర్టర్లమంటూ చెప్పుకుని అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ జర్నలిస్టు వృత్తిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు ఈ లంగా.. లుచ్చా..లపంగా..బద్మాష్‌..కేటు గాండ్లు (నకిలీ రిపోర్టర్స్‌). వీరి పని పట్టవలసిన సమయం ఆసన్నమైంది.
ఒక్క ఎల్బీనగర్‌ అడ్డాగానే కాకుండా హైదరాబాద్‌ మహానగరం లో ఇలాంటి నఖిలి విలేకరుల ఆగడాలు దినదినం మితివిూరి పోయాయని గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పత్రికల్లో చూస్తున్నాం నిజమైన పాత్రికేయులు పరువు కోసం ప్రాకులాడుతుంటే ఈ లుచ్చా గాళ్లు మనోవేదనకు గురి చేస్తున్నారని నికార్సైన వర్కింగ్‌ జర్నలిస్టులందరూ లబోదిబోమని నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల అటు పోలీసులు, ఇటు సమాచార శాఖ, ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచాలని, ప్రజలు కోరుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *