వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు . భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, దాడికి గురైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేఖలో మావోలు డిమాండ్ చేశారు. పూజారి రాధాకృష్ణ సహా నాస్తికవాదులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.