బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్ తరాలకు నీటిని అందించు
`22న ప్రపంచ నీటి దినోత్సవం
ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి 22 వ తేదీన నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ ‘’ (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 సంవత్సరాన్ని ‘‘ ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం, పరిశుభ్రమైన నీరు ‘‘ అనే, నిర్దిష్ట భావనతో పాటించడం జరుగుతుంది. మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30`50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా , 1,500 ఘన కిలోవిూటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా , అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా Ñ తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.నీళ్లు`నిజాలువేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల తల్లి నెర్రెలిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. ఇలాంటి కఠోర వాస్తవాలు కొన్ని…ప్రపంచంలో 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. భూమండలంవిూద లభించే నీటిలో ఉప్పు సుమద్రాల వాటా 97 శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి విూద లభించే నీటిలో 0.008 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48 దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్నారు. నీటిమూలంగా సంభవించిన 43 శాతం మరణాలకు అతిసారవ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14 ఏళ్ల లోపువారే.98 శాతం మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమివిూదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకునేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికివాడల్లో నివసించే ఒక వ్యక్తి రోజుమొత్తంవిూద ఉపయోగించే నీరు ఒక అమెరికన్ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివసించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5`10 రెట్లు అధికధర చెల్లిస్తున్నారు.ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు.ప్రతి 15 సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతోంది. లక్షలాది మంది మహిళలు, పిల్లలు రోజుమొత్తం విూద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాలనుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.నీటి కోసం ఒక రోజును ఎందుకు కేటాయించారు? నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏవిూ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. మన భూవ్మిూద నీటి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువైనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునేవారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూవ్మిూద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ, మేఘాలుగా మారుతూ, వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు డైనోసార్లు ఎంగిలి చేసిన నీటినే ఇప్పుడు మనం కూడా తాగుతున్నామన్నమాట. భూవ్మిూద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97 శాతం ఉప్పునీరే. కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలో ఉంది. మిగతా ఒక శాతం నీరులో 0.59 శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదులు, సరస్సుల్లో ప్రవహిస్తోంది. ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియాలాంటి చాలా దేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి? ఎక్కడైనా కొళాయిల్లోంచి నీరు వృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెంటనే కట్టేయండి. షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్ నీళ్లతో చేయండి. దీని వల్ల రోజులో 150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.Iపళ్లు తోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడం వల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్ ఫ్లష్‌లో సుమారు 8 లీటర్ల నీరు పడుతుంది. లీటర్ నీరు పట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్న చిన్న రాళ్లు నింపి, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండు లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి. కొళాయిలకి లీకేజీలు ఉంటే దానిని అరికట్టండి. దీనివల్ల నెలలో 300 గ్యాలన్ల నీరు ఆదా అవుతాయి. స్కూల్లో, విూ ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచండివిూకు తెలుసా? ఒక కిలో బియ్యాన్ని పండిరచడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్ డాలర్లు.