విశాఖపట్నం: విశాఖ లో ఇఎస్‌ఐ 400 పడక ల మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ స్థలాన్నిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఇఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇఎస్‌ఐ అధికారులు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి సవిూక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి,సాగి కాశీ విశ్వనాథ్ రాజు, జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు