విజయవాడ: దేశ అత్యున్నత న్యాయస్ధానం చారిత్రాత్మక తీర్పు నిచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. 370 అధికరణను పార్లమెంట్‌ లో రద్దు చేయడం జరిగింది. ఈ రోజు దేశ అత్యున్నత న్యాయ స్ధానం 370 అధికరణను రద్దు పరచడాన్ని సమర్ధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ రోజు చారిత్రాత్మక రోజుగా దేశ ప్రజలు భావించాలి. ద్వంద ప్రమాణాలకు బిజెపి వ్యతిరేకం ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిత్రాలు, రెండు జెండాలు వంటి వాటిని బిజెపి ఆది నుండి వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్‌ దేశం లో అంతర్భాగం కాదని భావించిన తరుణంలో 370 అధికరణ రద్దు చేయడం ద్వారా కాశ్మీర్‌ దేశ అంతర్భాగం అనే నమ్మకం కలిగింది. 370 అధికరణకు అభ్యంతరం తెలుపుతూ బిజెపి వ్యవస్ధాపనకు మూల కారకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌ వెళ్లినప్పడు ఆయనను అరెస్టు ఆయన ఆనుమానస్పద రీతిలో మృతి చెందడం వంటి సంఘటనలు దేశ ప్రజలు మరువలేదు. నేడు సుప్రీం తీర్పు దేశ ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *